నా చెల్లెళ్ళ దేహాల నిండా పిచ్చికుక్కల గాట్లు...
వారి చూపుల్లో బాధలు- కోట్ల ఆక్రందనలు...
ఉష్ భరించలేను - గుండెలో మంట, నరాల్లో తెగింపు!
ఆత్మాహుతి చేసుకున్న రైతన్నల కళేబరాలు
వారి పిల్లల ఆకలి కేకలు- భీకర ఘోషలు
ఉష్ భరించలేను- గుండెలో మంట, నరాల్లో తెగింపు!
నా తమ్ముళ్ళ చేతుల్లో పనికిరాని పట్టాలు
వారి తల్లిదండ్రుల ఆవేదనలు- పెల్లుబికే ఉక్రోషాలు
ఉష్ భరించలేను- గుండెలో మంట, నరాల్లో తెగింపు!
ప్రభుత్వ ఆఫీసులలో పత్రాల కోసం పడిగాపులు
సిగ్గులేని వారి వ్యవహారాలూ- వ్యవస్థపై హేళనలు
ఉష్ భరించలేను- గుండెలో మంట, నరాల్లో తెగింపు!
ఈ నాయకుల బూటకపు మాటలు
పార్టీల నాయవంచనలు- నిలువు దోపిడీలూ
ఉష్ భరించలేను- గుండెలో మంట, నరాల్లో తెగింపు!
ఇవాళ నా కసి వెలిగించిన నెత్తుటి మంటల్లో నిలబడి చెబుతున్నా...
"రైట్ టు వోట్" కాదు "ఫైట్ విత్ వోట్"...
ఈ దోపిడీ రేచుకుక్కల్ని తరిమితరిమి కొట్టండి!