వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రధచక్రాలొస్తున్నాయ్
మీ
మాటలకి అలసిన
చేతలకి రగిలిన
కూతలకి విసిగిన
అసత్యాలనెరిగిన
ఈ నవ యువతరంగ రధచక్రాలొస్తున్నాయ్
మహాత్ముడు మార్చి కాలగతిని,
తెచ్చిన ఈ దెశాన్ని దోచుకుతిని,
రైతుల కళేబరాలు కాలగా తిని,
దేశ ప్రయోజనాలు తెల్ల టోపీలలో దాచుకుతిని
బ్రతుకుతున్న మీరా మా నాయకులు?
లేదు! సమాజానికి పట్టిన చీడ పురుగులు
ఒకడు అసెంబ్లీలో చూస్తాడు బూతుబొమ్మలు
మరొకడు గవర్నర్ గిరీ పేరిట రచించాడు శృంగార లీలలు
ఒకడు అమ్మేశాడు రాష్ట్రం
ఇంకొకడు తినేశాడు భూగర్భం
2జి కుంభకోణం
కామన్వెల్తు భాగోతం
చస్తోందిరా సామ్యవాదంపై నమ్మకం
ఈ గణగణ రణగొణ ధ్వనులనుంచి,
గజిబిజి జీవితపు పరుగులనుంచి
లేస్తున్నాం
భగభగ మండే నిప్పుల కొలిమి వలె
ధగధగ మెరిసే ఆశాజ్యోతి వలె
వస్తున్నాం
రాజకీయాల్లోకి వస్తాం
నాయకులమౌతాం
మీ నిగ్గు తేలుస్తాం
పంచెలూడదీస్తాం
ప్రభంజనం సృష్టిస్తాం
కొన ఊపిరితో ఉన్న భారతమాతకు మా శ్వాసనందిస్తాం
నేతలమంటూ తిరుగుతున్న దగాకోరులారా
డబ్భై కోట్ల యువత ఒక్కటై
సింహాలవలె గర్జిస్తాయ్ , గాండ్రిస్తాయ్
ఆ వివేకానందుడి సూక్తులే ఊపిరై
సముద్రపు అలలవోలె మహాసేనల్లా కదం తొక్కుతాయ్
మీ నాయకత్వాలని అధినాయకత్వాలని చెరుపుతాయ్
ఆ యువ గుండెల నిప్పుకణాలు
కట్టుకుని కంకణాలు
బయలుదేరితే చేర్చుకుని గణాలు
పెట్టలేవా 'ఆ-భయ' పెడుతున్న 'హస్తం' మీద చురకలు?
మీ అతలాకుతల ప్రభుత్వానికి పాఠాలు నేర్పుతాయ్
మీ నాయకుల అఘాయిత్యాలకు చరమాంకం పాడతాయ్
వస్తున్నాయ్ వస్తున్నాయ్
యువతరంగ రధచక్రాలొస్తున్నాయ్
Entha nachindhante ... cheppa lenantha......
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteMeeru rasindhi three blog posts-e aina eppatike mee fan ni aipoyanandi.. :) Keep writing..
ReplyDeleteI will. Thank u
Delete