Sunday, 11 August 2013

ఓ పత్రం కోసం....

ప్రతీ క్షణం ప్రతీక్షణం 
నిరంతరం నిరీక్షణం 
అసమంజసమే క్షణక్షణం 

తైలమందిన క్షణం 
నిర్లక్ష్యమాయెనే అవలక్షణం 
తైలమందని క్షణం 
మరీ క్షుణ్ణం పరీక్షణం 

బంట్రోతు నుండి అమాత్యులు సైతం 
కోల్పోయారు విచక్షణం 
ప్రతి పత్రి కోసం 
చెయాలా వారి చుట్టూ ప్రదక్షణం??

అవ్వాలంటే దేశం విలక్షణం
అంతమొందాలి లంచగొండుల రాజ్యం తక్షణం.. 

No comments:

Post a Comment